Listen to this article

మంత్రి లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం:సీపీఎం మండల కన్వీనర్ రాము

జనం న్యూస్,మార్చి29,


అచ్యుతాపురం:అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణలో భూములు,ఇళ్ల స్థలాలు కోల్పోతున్న రోడ్డు నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా బాండ్లు పేరుతో మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వం గ్రామ రెవెన్యూల వారిగా రూ. 15 వేలు నుండి రూ.25 వేలు గజానికి ఇస్తామని అందరితో సంతకాలు చేయించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులను రోడ్డున పడే విధంగా వాళ్ళు టీడీఆర్ ఇస్తామనడం సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని నిర్వాసితులకు బాండ్లు వద్దు నగదు ఇవ్వాలని కోరుతున్నామని లేదంటే ఈనెల 31న లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని సీపీఎం నాయకులు సీపీఎం అచ్యుతాపురం మండల కన్వీనర్ ఆర్.రాము హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కె.సోము నాయుడు,చేపల తాతయ్య,అప్పారావు తదితరులు పాల్గొన్నారు