

జనం న్యూస్ మార్చి 31 కాట్రేని కోన : . విశ్వావసు నామ సంవత్సరం ఉగాది పర్వ దినం సందర్భంగా, కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో శ్రీ పార్వతి కుండలేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి ( జోతిర్వాస్తు సిద్ధాంతి) చే పంచాంగ శ్రవణం జరిగింది. ఈ విశ్వావసు నామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలాలు గురించి వివరించారు.ప్రజలు పాడి పంటలు సుఖ సంతోషాలతో అభివృధ్ధి చెందుతారని తెలియ జేసారు. అనంతరం ఆలయ ఈ.వో గంగాధరం. , బి.వేంకటేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు కాళ్ళకూరి కామేశ్వర శర్మ , మండల సబ్ ఇన్స్పెక్టర్ ఐ. అవినాష్ , మరియు గ్రామస్తుల సమక్షంలో ప్రవచన కర్తను ఘనంగా సన్మానించారు.