Listen to this article

జనం న్యూస్// జనవరి 14// జమ్మికుంట // కుమార్ యాదవ్..  హుజూరాబాద్ పట్టణనం విద్యానగర్ కు చెందిన బోనగిరి కమలాకర్ 64 రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్, జమ్మికుంట దుర్గ కాలనీ ప్రక్కన రైలు పట్టాలపై ఎగువ గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు, రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. హుజురాబాద్ విద్యానగర్ కు చెందిన కమలాకర్ ఏడాది క్రితమే, ఆర్టీసీలో కండక్టర్గా రిటైర్డ్ అయ్యారు. నాటి నుండి మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది జమ్మికుంట మడిపల్లి వద్ద రైలు పట్టాలపై గూడ్స్ ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అన్నారు. మృతునికి భార్య ఒక కుమార్తె, కుమారుడు,ఉన్నారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.