

ఇల్లందకుంట మండల గ్రామ శాఖ అధ్యక్షుల నియామకం..
పెద్ది కుమార్ ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు..
జనం న్యూస్ // ఏప్రిల్// 1 // కుమార్ యాదవ్ (జమ్మికుంట)..
కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ మరియు హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, ఆదేశాల మేరకు నేడు ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన గ్రామ శాఖ అధ్యక్షులకు నియామక పత్రాలను అందించడం జరిగింది. అందులో భాగంగా గ్రామ శాఖల అధ్యక్షులుగా వంతడుపుల – మ్యాడదా తిరుపతి రెడ్డి, రాచపల్లి- మూడెత్తుల మల్లేష్, టేకుర్తి – తోడేటి కిషన్, చిన్నకోమటి పల్లి – మూడెడ్ల రమేష్, సిరిసేడు – భోగం సాయి కుమార్, పాతర్లపెల్లి – బైరెడ్డి కొండాల్ రెడ్డి, మల్యాల – గురుకుంట్ల స్వామి, లక్ష్మాజిపల్లి – బండి మల్లయ్య, కనగర్తి – మిట్ట మోహన్ రావు, శ్రీరాములపల్లి – మేకల సురేష్, ఇల్లందకుంట – మీస రాజయ్య లకు నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు అభివృద్ధి పథకాలను, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో వివరించి ప్రజలకు పార్టీ పక్షాన మరింత చేరువ అయ్యేందుకు గ్రామ కమిటీలను నియమించడం జరిగిందని మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలోనే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఒక ప్రక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం ప్రజలకు అందిస్తూ దేశానికీ స్ఫూర్తిగా నిలుస్తుందని, గత కెసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం మీద మోపిన అధిక అప్పుల భారాన్ని చాకచక్యంతో ఛేదిస్తూ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరుస్తూ
ఏకకాలంలో రైతాంగానికి 20 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రుభుత్వం, సకాలంలో రైతు భరోసా, వడ్ల బోనస్ లాంటి పథకాలను అమలు చేసి రైతాంగానికి గొప్పగా అండగా నిలిచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది, అన్నారు. గతంలో ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ కెసీఆర్ ప్రభుత్వ విధానాల నుంచి విముక్తి చేసి సంవత్సర కాలంలో లోనే 55వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది, అని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తూ మహిళకు ఆర్థికంగా ఉపశమనం కల్పించిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిది, అంటూ 500 లకే వంట గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంపు, విద్యార్థులకు డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు భారీ స్థాయిలో పెంపు, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ లాంటి అనేక గొప్ప పథకాలను అమలు చేస్తుందని ఈ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించి ప్రతి కుట్రలను చేస్దిస్తామని శపథం చేస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి, తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులు అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్ది శివ కుమార్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మారపల్లి ప్రశాంత్,ఎక్కటి సంజీవరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, కనుమల్ల సంపత్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గైకోటి రాజు, గూడెపు ఓదేలు, మానసాని రవి, కోడం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.