

బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్…
జనం న్యూస్ // ఏప్రిల్ //1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..
సెంట్రల్ యూనివర్సిటీ భూముల అక్రమ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలన్నారు,బి అర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్, ఇ సందర్బంగా మాట్లాడుతూ..140 కోట్ల భారతీయుల ఆత్మ గౌరవ ప్రతీక ఆయిన జాతీయ పక్షి నెమలిని చంపడం దారుణం,అన్నారు. రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అంతే కాకుండా తక్షణమే సీఎం పదవికి వెంటనే రాజీనామా చెయ్యాలి అన్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి పై దేశద్రోహం కేసు పెట్టాలి అని మండిపడ్డారు. ఆకరికి తన భూ దాహానికి విశ్వవిద్యాలయాలు కూడా బలికాక తప్పడం లేదు అని తెలిపారు. గుడి జోలికి, బడి జోలికి , వెళ్లినోడు, పొడుగెళ్లినట్టు చరిత్రలో లేదు అని నెమళ్ళ హింస విషయంలో, సెంట్రల్ యూనివర్శిటీ భూముల అక్రమ అంశం లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని అన్నారు. ప్రధాని కావాలని కళలు కంటున్న రాహుల్ గాంధీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఎమర్జెన్సీ పాలన తేవడమే మీ లక్ష్యమా? అని బి ఆర్ ఎస్ వి రాష్ట్ర నాయకులు ఆవుల తిరుపతి యాదవ్ మాట్లాడారు.