Listen to this article

జనo న్యూస్; 1 ఏప్రిల్ మంగళవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;25

చరణాలతో పొందుపరిచిన ఈ గేయం నిన్న సాయంత్రం ఉగాది పర్వదినం సందర్భంగా, స్థానిక బ్రాహ్మణ పరిషత్ సభా మందిరం సిద్దిపేటలో జరిగిన కవి సమ్మేళనం లో, మాజీ మంత్రివర్యులు సిద్దిపేట సనసభ్యులు టి. హరీష్ రావు చేత ఆవిష్కరించబడినది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఫారుక్ హుస్సేన్ ఎమ్మెల్సీ కవి, గాయకులు శ్రీ దేశపతి శ్రీనివాస్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ ,మున్సిపల్ చైర్మన్ శ్రీ కడవేరుగు మంజుల రాజనర్సు పాల్గొన్నారు. ఈ పాటలు సిద్దిపేట యొక్క సమగ్ర అభివృద్ధి చిత్రపటం కార్యక్రమ వివరాలు విద్య వైద్య ఆరోగ్య శాఖల అభివృద్ధి సోదాహరణంగా 25 చరణాలతో పొందుపరచబడినది. పల్లవి. సిద్దిపేట మనది… సిరులు పండే తోట మనది.. సిద్దిపేట మనది.. అభివృద్ధికి కోట ఇది…

  1. పచ్చదనంతో పరిఢవిల్లగా
    పట్టణమే శోభిల్లెనుగా.. అన్నివైపులా ఆవరించి అది
    హరితహారం అయ్యే.. “సిద్దిపేట మనది”
  2. మన ఆరోగ్యమే మహాభాగ్యమని అందరికీ అందినగా..
    పేదల కోసమే పెద్ద వైద్యముతో
    ప్రజా వైద్యశాల..
  3. రైతును రాజుగా చేసిన నెలవు
    రైతు బజార్ అదిగో.. ఆధునికపు హంగులతో
    వెలసిన అంగడి ఆదర్శం.. సిద్దిపేట మనది.
    3 పావనమగు గోదావరి జలముతో
    పారిన పురము ఇది
    రంగనాయక సాగర్ నింపిన కాలేశ్వరం అదిగో. సిద్దిపేట మనది.
  4. అలల పైన అలరించను చూడు
    పడవల ప్రయాణమై
    కోటి కాంతులు వెదజల్లిన
    ఆ కోమటి చెరువు గదా… సిద్దిపేట మనది.