Listen to this article

జనం న్యూస్ 01 ఏప్రిల్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ రేసులో విశాఖపట్నంకి చెందిన ఏలూరు వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ) కూడా ఉన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేయడం పట్ల రాజేష్ కుమార్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా బ్రాహ్మణ అభ్యున్నతికి, బ్రాహ్మణ సంక్షేమానికి వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.దేశంలో కరోనా మహమ్మారి పీడించిన సమయంలో తీవ్ర ఇబ్బందులుఎదుర్కొన్నబ్రాహ్మణులకుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేయడంలో ముఖ్యపాత్ర వహించారు.ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతర సంఘాల్లో కూడా అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఏలూరి వెంకటరమణ (రాజేష్ కుమార్ శర్మ)ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అర్చక, పురోహిత సంఘాలు అలాగే వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు సంబంధించి బ్రాహ్మణ సంఘాలతో కూడా సత్సంబంధాలు తనకు ఉన్నాయని రాజేష్ కుమార్ శర్మ గారు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు పూర్తిస్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేందుకు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి పోటీ పడుతున్నారు.ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో గల పార్టీ పెద్దలను కలిసి తన బయోడేటాను అందజేసినట్టు తెలుస్తున్నది. తనకు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలు బ్రాహ్మణులకు అందేటట్లు చేస్తానని ఏలూరు వెంకటరమణ తెలియజేశారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మరింత బలోపేతం చేయడానికి,బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీలో సభ్యత్వ నమోదు అంతే కాకుండా అర్హులైన బ్రాహ్మణ యువతీ యువకులకు వివిధ రకాల వ్యాపారాలు, వృత్తులు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఏలూరు వెంకటరమణ తెలియజేశారు. అదేవిధంగా ప్రైవేట్ అర్చక,పురోహితులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వారుకోరుతున్నట్లుగా గుర్తింపు కార్డులు కూడా మంజూరు చేయడానికి కృషి చేయనున్నట్లు ఏలూరు వెంకటరమణ పేర్కొన్నారు. గతంలో చేయడం జరుగుతుందని రాజేష్ కుమార్ శర్మ తెలియజేశారు.