

జనం న్యూస్ 01 ఏప్రిల్
వికారాబాద్ జిల్లా పరిగిలో మైనార్టీ సోదరులను కలిసి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపినారు. అన్ని మతాలను సమానంగా చూసేదే భారత దేశం కులామతాలు లేకుండా అందరికి సమాన హక్కులు కలిపించింది భారత రాజ్యాంగం కాబట్టి అందరు సోదర భావం తో కలిసిమెలిసి ఉండాలని సుఖస్యాంతులతో ఆరోగ్యంగా ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నాయక్, బీఎంపీ దోమ మండల అధ్యక్షులు రవీందర్ నాయక్, అంబేద్కర్ విజ్ఞాన వేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మంచనపల్లి శ్రీనివాస్, పరిగి డిఫ్యూట్ సద్దర్ మహమ్మద్ రఫి, మైనారిటీ నాయకులు ఉస్మాన్, బాలకృష్ణ నాయక్, తదితరులు పాల్గొన్నారు.