

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట )..
తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వ నిధులే అని బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లోని పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా లభించే సన్న బియ్యం, ₹10000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులతో సరఫరా చేస్తున్నవే అని అన్నారు. రైతుల వద్దనుండి సేకరించే బియ్యానికి, బియ్యం సంచులకి, సంచులను కుట్టే తాడుకి, రవాణా కి, కూలీలకీ కేంద్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందన్నారు. ఈ ప్రక్రియను నిర్వహించేందుకు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుకి,, వడ్డీ, తో సహా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. పేదలకు ఇచ్చే సన్నబియ్యానికి అయ్యే ఖర్చులో కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ₹10 రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని, మిగితా ₹40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని దాచి ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని, బండి సంజయ్ కుమార్, కేంద్ర హోమ్ శాఖా సహాయక మంత్రి, జాతీయ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు.