

పేదవారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి..
త్వరలోనే రేషన్ కార్డుల పంపిణీ..
ఒడితల ప్రణవ్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..
తెలంగాణ రాష్ట్రంలో పండిన సన్నబియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.మంగళవారం నాడు కమలాపూర్ మండల కేంద్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన నిరుపేదలకు ఉచిత సన్న బియ్యం పథకాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం లబ్దిదారులకు సన్న బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా 17,263 రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని పేదలైన రేషన్ కార్డు లబ్దిదారులకు అందజేస్తామని, ప్రజల ఆరోగ్యాన్ని రుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఉగాది రోజున నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్న వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ ఇచ్చి త్సహిస్తున్నామనీ,రాష్ట్రంలోని రైతులకు,వ్యవసాయానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలిపారు.పదేళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులైన వారికి త్వరలోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. రామాలయంలో పోస్టర్ ఆవిష్కరణ..సన్న బియ్యాన్ని ప్రారంభించిన అనంతరం కమలాపూర్ లోని రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ప్రణవ్ బాబు ఆవిష్కరణ చేసారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారిని కళ్యాణానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
