Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 14 (జనం న్యూస్):-

త్రివేణి సంగమంలో భక్తజన కోటి సందడితో.. పుణ్య స్నానాలతో మహా కుంభమేళా కిటకిటలాడుతోంది. దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో రష్యా భక్తురాలు మహా కుంభమేళాపై ప్రశంసలు కురిపించారు. ‘మేరా భారత్ మహాన్. ఇది గొప్ప దేశం, కుంభమేళాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. భారత్ నిజమైన శక్తి ఇక్కడి ప్రజల్లోనే ఉంది. ఐ లవ్ ఇండియా. థ్యాంక్యూ వెరీ మచ్’ అని ఆమె చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.