

ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పి.పవన్ కుమార్ డిమాండ్.
విద్యార్థులపై పోలీసుల దాడులు,నిర్బంధాలను ఖండించాలి
జనం న్యూస్, ఏప్రిల్ 2,జూలూరుపాడు
రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్రమంగా వేలం వేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పెరుమాళ్ళ పవన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి విధానాన్ని నిరసిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా తెల్లవారుజామున విద్యార్థి నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.ఈ సందర్భంగా నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత పథకాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకారాల భూములను వేలం వేయాలని చూస్తే సహించే లేదని అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేసిన ఏకైక సెంట్రల్ యూనివర్సిటీ గ్రీన్ హౌస్ ఆఫ్ గా పిలుస్తారని ఈభూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలని అప్పటి భారత ప్రభుత్వం సూచించిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ భూములను తాకట్టు పెట్టాలని చూస్తుందని ఈ విధానాలను రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ యునివర్సిటీ భూములను పరిరక్షణ కోసం అమ్మకానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూన్న విద్యార్థి,విద్యార్థినిలపై విచక్షణ రహితంగా దాడులు నిర్బంధాలను ఖండించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణకై భవిష్యత్ పోరాటాలకు సిద్ధమవుతావని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు శ్రీరామ్, కృష్ణ, అనిల్, గణేష్, ప్రసాద్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.