

కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి గంగారపు మహేష్..
జనం న్యూస్ // ఏప్రిల్ //1 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..
హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఇల్లందుల సదయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కాగా మంగళవారం నాడు కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి గంగారపు మహేష్, మృతుడు సదయ్య కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. తదనంతరం మహేస్ మృతుడి కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందజేసారు.తన మంచి మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి గంగారపు మహేష్ మాట్లాడుతూ.. ఇల్లంతకుంట గ్రామ ప్రజలకు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే తన వంతుగా సాయం చేస్తానని, పేద కుటుంబాలకు ఎల్లవేళలు అందుబాటులో ఉంటూ, అండగా ఉంటానని నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.