

అవినీతి, అక్రమాలకు తావులేకుండా పథకం కొనసాగించాలి
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
సన్న బియ్యం పంపిణీ’పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జనం న్యూస్ 01 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్)
కొత్తగూడెం/చుంచుపల్లి/సుజాతనగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో సన్న బియ్యం పంపిణి పథకం కీలకంగా మారనుందని, పేద కుటుంబాల ఆకలితీర్చే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సాహసమేనని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలోని 28వ వార్డు రామాటాకీస్ ఏరియా, చుంచుపల్లి మండలంలోని రాంనగర్, సుజాతనగర్లో రేషన్ షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని కూనంనేని ప్రారంభించి మాట్లాడారు. గత పాలకుల సన్న బియ్యం పథకం అమలు ప్రకటనకు పరిమితమైందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఈ పథకం ఆదర్శమని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, పోషకాహార భద్రతకు ఈ పథకం దోహదపడుతుందని, ఈ పంపిణీ కార్యక్రమాన్ని పేదవర్గాల సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పథకాన్ని ఎలాంటి అవినీతి, అక్రమాలకూ తావులేకుండా పకడ్బందీగా కొనసాగించాలని, సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. పేదల బియ్యం పక్కదారి పడితే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కాంగ్రెస్ నాయకులు నాగ నాగసీతారాములు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి రుక్మిణీదేవి, సివిల్ సప్లైస్ డిఏం త్రినాధ్, సీల్దార్లు పుల్లయ్య, కృష్ణ, శిరీష, డిటి మహేష్, స్థానికులు వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, భాగం మహేశ్వర్ రావు, జక్కుల రాములు, కొమారి హన్మంతరావు, కంచర్ల జమలయ్య, మునిగడప వెంకటేశ్వర్లు, నేరెళ్ల శ్రీనివాస్, భూక్యా శ్రీనివాస్, ధర్మరాజు, యూసుఫ్, బోయిన విజయ్ కుమార్, సత్యనారాయణ చారి, సుధాకర్, దుర్గ, యాలాద్రి, యాకుబ్, యాసిన్, వేణు, రామారావు తదితరులు పాల్గొన్నారు.