

మండలాలలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ బలోపేతం చేయాలి.
అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలి.
క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై సమాచారం, అవగాహన కలిగి ఉండాలి.
రౌడీలపై, కేడీ లపై, షీటర్స్ పై నిరంతర నిఘా ఉంచాలి.
పెండింగ్ కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలి.
జనం న్యూస్ 2ఏప్రిల్ ( భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )
గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేసి పటిష్టంగా పని చేసేలా ప్రణాళిక చేయడం జరిగినది. స్టేషన్ పరిధిలో గుర్తించిన గ్రామాల్లో ప్రతి ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో సమస్యలు గుర్తించడం, చట్టాలపై, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమస్యలు సృస్టించే వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం తద్వారా నేరాలను ఆధుపుచేయడం ఉద్దేశ్యంసమీక్ష లో భాగంగా నేరాల నమోదు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్ శిక్షలు అమలు, డయల్ 100 కాల్స్, సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూ ఆర్ కోడ్ పని తీరు, ఫిర్యాదుల పై స్పందన, వాహనాల తనిఖీ, అనుమానిత వ్యక్తుల కదలికలు, రౌడి షిటర్స్ పై నిఘా, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, సైబర్ మోసాల్లో నగదు రిఫండ్, దొంగతనాల కేసుల్లో కేసుల డిటెక్షన్ మొదలగు అంశాలను సమీక్షించారు. జిల్లాలో బుధవారం నుండి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని, గ్రామ పోలీసు అధికారిని బలోపేతం చేసి ప్రతి గ్రామంలో విపిఓ ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు.స ఏసీపి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలో గల సమస్యత్మ గ్రామాన్ని గుర్తించి ప్రతి బుధవారం ఒక గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించాలి. తద్వారా గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఏ చిన్న సంఘటనలు జరిగిన పోలీసులకు తెలుస్తుంది, గ్రామ ప్రజలతో కలిసిపోవడం వల్ల సమస్యలు సృష్టించే వారి గురించి తెలుస్తుంది. లోకల్ బాడి ఎన్నికలు వచ్చే నాటికి గ్రామాలు పోలీసు అధీనంలోకి వస్తాయి, ప్రశాంత గ్రామీణ వాతావరణం ఏర్పాటు చేయవచ్చు పోలీస్ శాఖ అంటే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే అత్యవసర శాఖ అని శాంతిభద్రత రక్షణ, పౌరులు భద్రత ముఖ్య విధి ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ బాధితులకు భరోసా కల్పించాలి, ప్రణాళిక ప్రకారం పని చేసి నాణ్యమైన దర్యాప్తు చేయాలి . వర్గ విభేదాలకు సంభందించి భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమాచారం సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి . పోలీసు స్టేషన్ నందు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో నిపుణుల, అనుభవజ్ఞుల సలహాలు, అధికారుల సూచనలు తీసుకుని పరిష్కరించాలి. గ్రామాలు, కాలనీలు, పట్టణాలు ఇలా ఎక్కడైనా ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు సమాచారం వచ్చేలా వనరులు వృద్ధి చేసుకోవాలి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అమశంపై సమాచారం, అవగాహన కలిగి ఉండాలని ఆన్నారు. ఎస్ ఐ పోలీసు సిబ్బంది విధులపై, కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణ పై నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. సివిల్ ఫిర్యాదుల్లో ఎవ్వరూ గొడవలు పెట్టుకోకుండా ఉండాలని ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరంగా పరిష్కరించుకోవాలి అని సూచించాలి అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పని చేయాలి. రౌడీలు, కేడీలు, షిటర్స్ పై నిఘా ఉంచి వారి ప్రస్తుత జీవన విధానం ఎప్పటికప్పుడు నమోదు చేయాలి అన్నారు. మళ్ళీ మళ్ళీ నేరాలకు పాల్పడకుండా, సమస్యలు సృష్టించకుండా బైండోవర్ చేయాలి అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని . సైబర్ మోసాలపై, మహిళా భద్రతపై అవగాహన కల్పించాలి. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ ఎస్ఐ కే శ్వేత జైపూర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు