Listen to this article

గొప్ప సంకల్పం తో సన్న బియ్యం పతకం అమలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

కొరపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి..

జనం న్యూస్ // ఏప్రిల్ // 2 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..

తెలంగాణ రాష్ట్రంలో పండిన సన్నబియ్యం ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందామని కొరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలము లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసిన నిరుపేదలకు ఉచిత సన్న బియ్యం పథకాన్ని కొరపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పరుశురాం రావు, ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.అనంతరం లబ్దిదారులకు సన్న బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా కొరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు,శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని, పేదలైన రేషన్ కార్డు లబ్దిదారులకు, సన్న బియ్యం పంపిణి చేయడం జరిగింది అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఉగాది రోజున నల్గొండ జిల్లా, హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ పథకాన్ని ప్రారంభించారని అన్నారు. పేదలు కడుపునిండా అన్నం, తినాలి అనే  సంకల్పం రేవంత్ రెడ్డి కీ రావడం చాలా గొప్ప నిర్ణయం అని అన్నారు. మాట ఇచ్చిన ప్రకారం నిరుపేదలకు సన్న బియ్యం పతకం అమలు చేసారు, అని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మాటిస్తే మాట తప్పదు, అని అందులో భాగంగా కొరపల్లి లో సన్న బియ్యం అర్హులైన పేదలకు పంపిణీ చేయడం జరిగిందని, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఇ కార్యక్రమం లో వీరనేని పరుశురాం రావు జమ్మికుంట మండల అధ్యక్షులు, మరియు జమ్మికుంట మార్కెట్ డైరెక్టర్ శ్రీను, మాజీ సర్పంచ్ కుమార్, ఫిషర్ మాన్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి రాకేష్, విలేజ్ ప్రెసిడెంట్ కాంతాల శ్రీనివాస్ రెడ్డి, పొలసాని సంతోశ్ రావు, గరవేన శ్రీనివాస్ యాదవ్, కల్లపెల్లి జంపయ్య, చంద్రమౌళి, లింగయ్య, రాజకుమార్, ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.