

జనం న్యూస్- ఏప్రిల్ 2- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువ తేజం కార్యక్రమంలో భాగంగా ఈనెల 5వ తారీకు శనివారం ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ కంపెనీల ద్వారా నిరుద్యోగ యువతీ యువకుల కు మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి/ ఇంటర్/డిప్లమా/ఫార్మసీ/డిగ్రీ/ ఇంజనీరింగ్/పీజీ స్థాయి విద్యార్థులు వయస్సు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు లోపు వారు మీ యొక్క వివరాలను పోలీస్ స్టేషన్లో వెంటనే నమోదు పరుచుకోవాలి. ఇట్టి జాబ్ మేళా లో వందకు పైగా కంపెనీలు, 2500 వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. జాబ్ లో సెలెక్ట్ అయిన వారందరికీ వారి అర్హతలను బట్టి కనీస జీతం 13000/- రూపాయలు అని, నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ మాట్లాడుతూ నాగార్జునసాగర్ సర్కిల్ పరిధిలోని నిరుద్యోగ యువతి, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.