

పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమ ప్రారంభోత్సవంలో. సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ
జనం న్యూస్ ఏప్రిల్ 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )-
ప్రజలందరికీ పోలీస్ సేవలు అందించడంతో పాటు ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించేందుకు,మరియు సైబర్ నేరాలు ఆన్ లైన్ మోసాలు, హత్యలు,ఘోరాలు పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సూర్యాపేట జిల్లాలో పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ తెలిపారు. బుధవారం మునగాల మండల పరిధిలోని కలకోవ గ్రామంలో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.. మారుమూల గ్రామాలలో మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా పోలీసు శాఖను పోలీసు సేవలను అతి చేరువ చేయడం,పౌరులు ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకునేలా చట్టాల గురించి వివరించడం, పోలీసు మీ రక్షణ భద్రత కోసం ఉన్నారు అని తెలియపరచి,అవగాహన లేకుండా చట్టాన్ని ఉల్లంఘించి ఇతరుల పై, ఇతరుల ఆస్తులపై దాడులు చేయవద్దు అని తెలపడం, సమాజంలో అవగాహన లోపం వల్ల నేరాలకు పాల్పడి జీవితాలను జైలుపాలు చేసుకోవద్దు అనే విషయాలను వివరించడం. గ్రామాల్లో అలజడి వాతావరణం, సమస్యలు సృష్టించే వారిలో మార్పు తీసుకురావడం, సామాజికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటిని నిర్మూలించడం కోసం, తద్వారా గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించి పోలీసు సేవలు అందించడం ఈ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ఉద్దేశం అనివారు అన్నారు. దీనికోసం గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను సమర్థవంతంగా పని పని చేస్తూ.ప్రతి బుధవారం జిల్లా వ్యాప్తంగా సర్కిల్ పరిధిలో ఒక పోలీసు స్టేషన్ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో డీఎస్పీ పై స్థాయి అధికారి అందుబాటులో ఉండేలా చూస్తూ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నేరాల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే విషయంలో విదేశాలకు వెళ్లే విషయంలో పై చదువుల విషయంలో సమస్యలు వస్తాయి. ఏ వ్యక్తి పైన అయినా ఒకసారి రౌడీ షీట్ సస్పెక్ట్ షీట్ లాంటిది నమోదైతే జీవితాంతం ఆ మచ్చ అలాగే ఉంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు పాల్పడే చర్యలకు జీవితకాలం జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. మహిళల పట్ల, పిల్లల పట్ల చట్టాలు బలోపేతం చేయబడ్డాయి. రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలి, అజాగ్రత్తగా మద్యం మత్తులో, అధిక వేగం తో, నిర్లక్ష్యంగా వాహనాలు తొలడం వల్ల రోడ్డు ప్రమాదాల జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. అత్యాశకు పోయి సైబర్ మోసాల బారిన పడి డబ్బు కోగొట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోతుంది. ఇలాంటి అంశాలు వివరించడం కోసం పోలీసు మరింతగా ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం ఉన్నది. చెడు నడవడిక, చెడు ఆలోచ ఉన్నవారిలో మార్పు తేవాలి అన్నారు, కార్యక్రమంలో మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఎస్సై ప్రవీణ్ కుమార్, ట్రైనీ ఎస్సై గోపాల్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.