

జనం న్యూస్ ఏప్రిల్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
ప్రజా ప్రభుత్వం పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలని చూడడం ఎంత వరకు న్యాయమని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ అన్నారు మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ సి యు భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు అనంతరం రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ సి యు భూముల అమ్మకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ ల అమలులో పూర్తిగా విఫలమైందని యూనివర్సిటీ భూములను అమ్మకానికి పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు భూములను అమ్మినట్లయితే వన్యప్రాణులకు విద్యార్థులకు రక్షణ కరువవుతోందన్ని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో విద్యార్థులు ప్రజలు చేతులలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మైలారం మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్ కోతాటి రమేష్ పెద్దిరెడ్డి కృష్ణారెడ్డి అరికెళ్ల వెంకట్ తట్ల సాయి దైనంపల్లి రాజేష్ శశి మెండు నితిన్ తదితరులు పాల్గొన్నారు…..