Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 03 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గ్రామానికి బాంబర గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌, నాయకులు బెండరే క్రిష్ణ డా చంద్ర శేఖర్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీ లో ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీలో చేరిన వారు మాట్లాడు తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల అధ్యక్షులు నారాయణ, టౌన్ అధ్యక్షులు అనిల్, యువజన ప్రశాంత్, యువ నాయకుదు దీపక్ తదితరులు పాల్గొన్నారు