

బీరప్ప స్వామి కామరాతి- కళ్యాణ మహోత్సవము
జనం న్యూస్ ఏప్రిల్ 3 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామంలో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి జాతర మొదలవుతుంది స్వస్తి శ్రీ విశ్వా వసు నామ సంవత్సర చైత్ర శుద్ధ షష్టి గురువారం మూడు తేదీ నుండి మరియు చైత్ర శుద్ధ పౌర్ణమి తేదీ 12 శనివారం వరకు శ్రీ బీరప్ప జాతర జరుపబడును నేటి నుండి జరగవలసిన కార్యక్రమ వివరములు 27 గురువారం రోజున పసుపు కొట్టం పెట్టుట మొదలు మరియు తేదీ 3 గురువారం రోజున మంద పోచమ్మ పండుగ చేయబడును మరియు 4 తేదీ శుక్రవారం రోజున దేవుని మహిళా బోనం మరియు గద్దె బోనం తీయుట తేదీ 5 శనివారం నాడు గంగకు పోవుట మరియు తేదీ 6 ఆదివారం రోజున లగ్న బోనాలు తీయుట తేదీ 7 సోమవారం ఉదయం 11 45 నిమిషములకు బీరప్ప కామరాతి దేవుని కళ్యాణం మరియు గొర్లకోయుట గావు పట్టుట మందమీద సరుకు చల్లుట మరియు తేదీ 8 మంగళవారం రోజున కాశీ రామవ్వ కథ చెప్పుట మరియు తేదీ 9 బుధవారం రోజున గ్యారేజ్ వేషం ఎల్లమ్మకు ఎరుక చెప్పుట సాయంత్రం నాగవెల్లి నాలుగు వేషాలతో తీయుట తేదీ 10 గురువారం రోజున నాగవెల్లి అక్క తమ్ముని వాదం సల్లలు చేయుట మరియు మందమీద చల్లలు పోయుట కార్యక్రమం జరుపబడును తేదీ 11 శుక్రవారం బయన్న పండుగ ఇండ్ల దగ్గర కడుపలు కడుగుట గొర్ల లగ్నాలు తేదీ 12 శనివారం రోజు బీర్ల వాళ్లను ఇంటికి పంపుతా కార్యక్రమం జరుపబడును కావున భక్తులు సకాలంలో విచ్చేసి బీరప్ప జాతరలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మనవి ఆహ్వానించువారు కురుమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుపబడును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ బీరప్ప స్వామి జాతర విజయవంతం చేయగలరని భక్తులకు మనవి