

పేదోళ్ళు సన్నబియ్యం తినాలనే లక్ష్యం కాంగ్రెస్ పార్టీది
మండల అధ్యక్షులు కొత్తపెళ్లి మోహన్ రెడ్డి
జనం న్యూస్ 2025 ఏప్రిల్ 3 ( భీమవరం మండల ప్రతినిధి కాజీపేట రవి )
భీమారం మండలంలోని బుధవారం రోజున చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఎల్కేశ్వరం గ్రామపంచాయతీలో ప్రజా ప్రభుత్వం కార్డున్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందజేయడమే రాష్ర్ట ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్ధేశ్యం అన్నారు. రేషన్ దుకాణంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉగాది కానుకగా సన్నబియ్యం పథకాన్ని ఎమ్మార్వో సదనానందం ప్రారంభించారు,ఈ కార్యక్రమంలోముఖ్యఅతిథిలు ఎల్కేశ్వరం మాజీ సర్పంచ్ సమ్మయ్య శ్యామ్ సుందర్ వెంకట్ రెడ్డి బీసీ సెల్ అధ్యక్షులు బోయ లక్ష్మణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా భీమారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపెళ్లి మోహన్ రెడ్డి మాట్లాడుతూ పేదోళ్ళు సన్నబియ్యం తినాలనే ముఖ్య లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వంది అని గుర్తుచేశారు. అంతే కాకుండా పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నో ఏళ్లుగా చెబుతూనే వచ్చాయని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి అని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఖరీఫ్ సీజన్లో రైతుల నుండి క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి 24 లక్షల టన్నుల సన్న వడ్లను కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. వాటిని మిల్లింగ్ చేయించి, వచ్చిన బియ్యాన్ని రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.