Listen to this article

అతిధి డెవలపర్స్ అధినేత కాంగ్రెస్ యువనేత కొమ్మిడి రాకేష్ రెడ్డి..

జనం న్యూస్ // ఏప్రిల్ // 3 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట)..

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బుర్ర రవి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు. కాగా రవి మృతి చెందిన విషయం తెలియగానే, అతిధి డెవలపర్స్ అధినేత కాంగ్రెస్ యువనేత కొమ్మిడి రాకేష్ రెడ్డి, తన యువ సైన్యం పంపించగా, వారు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు, తన వంతు సాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్, కాజా మీయ ఎండీ,సాయి, సమ్మయ్య , విద్యాసాగర్, శ్రావణ్, బుర్ర శీను, రాజు, రంజిత్, రవి, శీను గ్రామస్తులు పాల్గొన్నారు.