Listen to this article

ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన రాపోలు గ్రామ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు గండు వెంకటేష్ 

జనం న్యూస్ 04 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ )

వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోలు గ్రామంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గండు వెంకటేష్ చేతుల మీదుగా  ప్రారంభించడం జరిగింది. అనంతరం సన్న బియ్యాన్ని గ్రామ ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా గండు వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల అదనపు భారాన్ని భరించి ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం ఇచ్చే నిర్ణయం దేశంలోనే చారిత్రాత్మకమైన కార్యక్రమంగా అభివర్ణించారు.  పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అణ గారిన బడుగు బలహీన వర్గాల దళిత గిరిజన బిస్సి మైనార్టీ ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పం అన్నారు. ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఉప్పరి రాకేష్, సాగర్ మండల కోశాధికారి, ఈశ్వర చారి సీనియర్ నాయకులు వి నరసింహారెడ్డి రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.