

గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు (యూత్ లీడర్), కొండా శివ శంకర్ రెడ్డి.
అర్ధవీడు యువతకు ఆదర్శం మన “కొండా”శివ శంకర్ రెడ్డి.
జనం న్యూస్, ఏప్రిల్ 04,(ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, రామిరెడ్డి):-
ప్రకాశం జిల్లా, అర్ధవీడు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన, అత్యంత బలమైన యూత్ లీడర్ మన యువ నాయకులు కొండా శివశంకర్ రెడ్డి. అర్ధవీడులో రాజకీయంగా అందరికీ సుపరిచితమైన వ్యక్తి మన కొండా శివ శంకర్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ, పార్టీపట్ల వీర విధేయుడుగా ఉంటూ, ఎంతో క్రమశిక్షణ కలిగిన మన యువ నాయకులు కొండా శివ శంకర్ రెడ్డి. అతని నిబద్ధతను గుర్తించిన అధిష్టానం గిద్దలూరు నియోజకవర్గంలో మన ప్రియతమ నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విధేయుడుగా, మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉండే యువ నాయకులు మన కొండా శివ శంకర్ రెడ్డి. అటువంటి యువ నాయకులైన మన కొండా శివశంకర్ రెడ్డికి పార్టీలో తగిన గుర్తింపు, అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినచో ఎంతో సమర్థవంతంగా నిర్వహించగలడు. గిద్దలూరు నియోజకవర్గం అర్ధవీడు మండలంలో ఎంతో సమర్థత కలిగిన మన యువ నాయకులు “కొండా”శివ శంకర్ రెడ్డి నాయకత్వాన్ని అర్ధవీడు యువత కోరుకున్నట్లు తెలుస్తుంది.. కష్టాలు కొత్తేం కాదు, గతంలో ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఉంటాయి. ఎన్నో కష్టాలని బాధల్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ మన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ. “నిలబడతాం, తలపడతాం, పోరాడుతాం, మళ్ళీ గెలుస్తాం” అంటున్న మన అర్ధవీడు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కొండా శివ శంకర్ రెడ్డి.