Listen to this article

జనం న్యూస్ :4 ఏప్రిల్ శుక్రవారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి

జడ్.పి.హెచ్.ఎస్ పొన్నాల సిద్దిపేట పాఠశాలలో బెజ్జంకి మండలంలోని ప్రాథమిక పాఠశాల బెజ్జంకి ప్రధానోపాధ్యాయులు వడ్ల కొండ శ్రీనివాస్ గారు “హెల్మెట్ ధరించండి ప్రాణులు కాపాడుకోండి” పొందించిన కరపత్రాన్ని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, ప్రమాదంలో గాయపడకుండా ఉండడానికి సురక్షితమైన ప్రయాణం చేయడానికి హెల్మెట్ ధరించడం ప్రధానమని తెలిపారు.కర పత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్న ప్రధా నోపాద్యాయులు వడ్ల కొండ శ్రీనివాస్ ని అభినందించారు.కార్యక్రమంలో బి రంగారావు , శ్రీరామ్ శ్రీనివాస్ ,శంకర్, శ్రీనివాస్ ఎ.వెంకటేశ్వర్లు , అశోక్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , అంబటి సిద్దయ్య, మల్లికార్జున్ రెడ్డి , జె .శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.