

జనం న్యూస్ ఏప్రిల్ 04 సంగారెడ్డి జిల్లా
పటాన్ చెరు పట్టణంలో ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసిబిదాడులునిర్వహించారు.గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవి కిషోర్ లక్ష రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ సిటీ రేంజ్ 2 డిఎస్ పి శ్రీధర్ పట్టుకున్నారు. గుమ్మడిదల మండలంలో నాల ఎన్ఓసి క్లియరెన్స్ గురించి 10 లక్షల రూపాయలు గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ డిమాండ్ చేశారు.దానికి 7 లక్షల రూపాయలకు ఏ ఈ రవి కిషోర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు .దాంతో గత నెల 28వ తేదీ నుంచి రోజు ఫోన్ చేస్తుండడంతో హైదరాబాద్ ఏసీబీ కార్యాలయంలో బాధితుడుఆశ్రయించాడు. ఒప్పందం లోబాగంగా శుక్రవారం ఉదయం పటాన్చెరు నీటిపారుదల కార్యాలయం లో మొదటగా లక్ష రూపాయలు ఏఈ రవి కిషోర్ కార్ డాష్ బోర్డులో డబ్బులు పెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మొత్తం డబ్బులు ఏ ఈ తో పాటు ఇంకా పై అధికారులు ఏమైనా ప్రమేయం ఉందా ఒక్కడే డిమాండ్ చేశాడా అనే కోణంలో విచారణలో తేలాల్సి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.లక్షరూపాయలు స్వాధీనం చేసుకుని ఏఈ రవి కిశోర్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తామని మీడియాకు ఏసీబీ అధికారి డీఎస్పీ శ్రీధర్ ( హైదరాబాద్ రేంజ్ 2) వెల్లడించారు.