

జనం న్యూస్ 15 బుధవారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు… మెదక్ జిల్లా చేగుంట మండలం రామంత పూర్ శివారులోని జాతీయ రహదారి 44 పక్కన ఉన్న శ్రీ హంస ఫ్యామిలీ రెస్టారెంట్ పక్కన గల అంబేద్కర్ విగ్రహం వెనుకల మతిస్థిమితం లేని ఒక మహిళా మీద ముగ్గురు వ్యక్తులు తేదీ 08.01.2025 నాడు ఉదయం అందజా 04:30 గంటల సమయంలో అత్యాచారం చేసినారని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బాధితురాలిని గుర్తించడం జరిగినది. అత్యాచారం చేసిన ముగ్గురు వ్యక్తులు చేగుంటకు చెందిన కోళ్ళు సప్లయ్ చేసే వెహికల్ మీద డ్రైవర్ మరియు హెల్పర్ లుగా పనిచేసే వారిగా గుర్తించి, తేదీ 15.01.2025 నాడు నేరస్థులు అయిన
A-1 సయ్యద్ ఆఫ్రోజ్, జాకిర్, వయస్సు: 24 సం.లు, వృత్తి: డ్రైవరు, నివాసం : తూప్రాన్.
A-2 గౌర బసవరాజ్, జగన్నాథం, వయస్సు: 21 సం. లు, వృత్తి: లేబర్, కులం: లింగాయత్, నివాసం చేగుంట,
A-3 మహమ్మద్ సాహిల్ షాహెబ్, ఇలియాజ్, వయస్సు 21 సంవత్సరాలు కులం: ముస్లిం, నివాసం : హౌరియా తాలూకా, బాకా జిల్లా, బీహార్ రాష్ట్రం ప్రస్తుత నివాసం చేగుంట లను పట్టుకోని కోర్టులో హాజరుపర్చడం జరుగుతుంది