

జనం న్యూస్ జనవరి 15(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గూళ్య పాలెం గ్రామ పరిధిలోని కొంతమంది కోడిపందాలు ఆడుతున్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 9 మంది మూడు కోడి పుంజులతో పందెం కాస్తున్న వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 14750 నగదు మూడు కోడి పుంజులు, రెండు కత్తులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగ స్వామి తెలిపారు,ఎస్సై నాగ స్వామి మాట్లాడుతూ అనంతపురం ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఉరవకొండ రూరల్ సీఐ ఆధ్వర్యంలో మా వజ్రకరూర్ పోలీస్ బృందంతో కలిసి ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు, వజ్రకరూరు మండలంలో ఇలాంటి కోడి పందేలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్ఐ నాగస్వామి తెలిపారు,ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.