Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 6 // జమ్మికుంట // కుమార్ యాదవ్..

అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ హాజరయ్యారు.స్వామి వారికి పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు అందజేసిన జేసారు.
రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత మజ్జిక పంపిణీ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రణవ్ ప్రారంభించారు.అపర భద్రాద్రిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.