Listen to this article

జనం న్యూస్ ;7 ఎప్రిల్ సోమవారం

సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయం లో బ్లూ డే వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమము లో విద్యార్ధిని విద్యార్థులు నీలి రంగు దుస్తులు ధరించారు.ఈ కార్య క్రమము లో పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నీలం రంగు ప్రశాంతత, నమ్మకం మరియు విశ్వసనీయతతో సహా అనేక విషయాలను సూచిస్తుంది. ఇది ప్రశాంతత, స్థిరత్వం మరియు లోతును కూడా సూచిస్తుంది. భద్రత మరియు విశ్వసనీయత యొక్క భావాన్ని సృష్టించడానికి నీలం తరచుగా డిజైన్‌లో ఉపయోగించబడుతుంది.అని విద్యార్థులకు వివరించారు.ఈ కార్య్రమంలో కరస్పాండెంట్ లిఖిత, ఉపాధ్యాయినులు రత్నమాల,వాణిశ్రీ, దేవిక,కావేరి,భారతి,అర్షియా,అనురాధ,మానుష పాల్గొన్నారు.