

జనం న్యూస్ ఏప్రిల్ 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా
చిలిపి చెడు మండలం, చండూరు గ్రామంలో ఐదవ రోజు అయినటువంటి శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి జాతర కన్నుల పండుగగా సాగుతుంది సోమవారం ఉదయం 11:35 లకు బీరప్ప కామరాతి దేవుని కళ్యాణం కల్యాణ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గొర్లపోయుట గావు పట్టుట మందమీద సరుగు చల్లుట కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు మరియు అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది బీరప్ప స్వామి కామరాతి కళ్యాణం మహా వైభవంగా జరిగింది చండూరులో ఒక పండగ వాతావరణం నెలకొంది