

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 7 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ఈ నినాదాన్ని క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉందని మేదరమెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జి.శ్రావణి పేర్కొన్నారు సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని హెల్ప్ టి ఐ మెదరమెట్ల, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, బాపట్ల జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ సమీకృత వ్యూహం ( దిషా ) ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్స్ కు ఏఎన్ఎంలు, విద్యార్థిని విద్యార్థులకు వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించటం జరిగినది డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ మానసిక ఒత్తిడి,, అపరశుభ్రతమైన ఆహారం ద్వారా, చెడు వ్యసనాల ద్వారా అనారోగ్యాలు గురవుతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో మనం తినే ఆహారం నీరు, గాలి కలుషితంతో చిన్న వయసులో ఉన్న చాలా మందికి రక్తపోటు షుగర్ లాంటి జబ్బులు రావటం చాలా బాధాకరమని క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్స్ మీరు గృహాలు సందర్శించినప్పుడు వారికి మంచి ఆహార అలవాట్లు వాటి విలువ తెలియజేస్తూ ఎవరికైనా అనారికే సమస్యలు ఉంటే వెంటనే వారిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లయితే వారి జబ్బును గుర్తించి ప్రాథమిక స్థాయిలోని వారి యొక్క వైద్యం అందించినట్లయితే వారు ఆ వ్యాధి నుండి త్వరగా కోలుకొనుటకు అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారుహెల్ప్ టి ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి వి సాగర్ మాట్లాడాతు చాలా సర్వేల్లో మానసిక ఒత్తిడి ద్వారా రక్తహీనత ద్వారా చిన్న వయసులోనే బాల్యవాహాలు చేయటం ద్వారా ఏడు సెకండ్లకు ఒక గర్భిణీ స్త్రీ సరిపోతుందని గర్భిణీ స్త్రీలకు పౌష్టికార అందించడంలో చాలా జాగ్రత్తలు వహించాలని వారి తినే ఆహారంలో చాలా నియమాలు వారికి మానసిక శారీరక ప్రశాంతత ఉండే విధంగా చూడాలని కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ అందించే విధంగా చూసుకోవాలని ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పొట్టబోయే బిడ్డ జాగ్రత్తగా పుడతాడని ఆరోగ్యంగా జన్మనిస్తారని హెచ్ఐవి ఎయిడ్స్ బాధ్యతకు మెరుగైన వైద్య సేవలు వైద్యులు ఆశ వర్కర్స్ ఏఎన్ఎంలు ఎప్పటికప్పుడు వారికి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు మధ్యలో మందులు ఆపేసినట్లయితే వారిని గుర్తించి వెంటనే వారు మందులు వాడుకునే విధంగా చూడాలని క్షయ క్యాన్సర్ గుండె రక్తపోటు షుగర్ ఈ వ్యాధులు అనే క్షేత్రస్థాయిలోనే గుర్తించి వారికి తగిన వైద్య సేవలు అందిస్తే వారికి ప్రాణాంతకం నుండి బయట పడతారని ప్రతిరోజు వ్యాయామం,నడక యోగా లాంటి ప్రక్రియను చేస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు ఎదుర్కోరని సేంద్రియ వ్యవసాయంతో పండించిన వ్యవసాయ కూరలు తీసుకోవడం ద్వారా మంచి ఆహారం పౌష్టికాహారం మానవులకు అందుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ సి ఓ పి. బ్రహ్మానందం పి హెచ్ ఎన్ కే సురేఖ హెల్ప్ టి ఐ ఎం. ఈ ఏ టి అనిల్ కుమార్ హెల్ప్ అవుట్ రిచ్ వర్కర్స్ కె దుర్గా,ఆర్ కృష్ణవేణి ఆశ వర్కర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారు