

జనం న్యూస్, ఏప్రిల్ 08, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
ఆశాజనకమైన భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన ఆరంభం2025 ఏప్రిల్ 7 న జరుపుకునే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై ఏడాది పొడవునా నిర్వహించబడే ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. దీనిలో భాగంగా మాతృ మరణాలు మరియు శిశు మరణాలను అంతం చేయడానికి మహిళలు దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం కృషి చేద్దాం. ఆరోగ్య వంతమైన శిశువు జన్మించడం ద్వారా ఆరోగ్యవంతమైన యువతిగా ఎదగడం వల్ల ఆరోగ్యవంతమైన గర్భిణీ ద్వారా ఆరోగ్యవంతమైన శిశు జననం జరుగుతుంది. ప్రతి చోట మహిళలకు వారు శారీరకంగా మరియు మానసికంగా ప్రసవానికి ముందు ప్రసవ సమయంలో మరియు తర్వాత కూడా వారికి మద్దతు ఇవ్వడం ద్వారా సాధించగలం. తల్లులు మరియు శిశువుల ఆరోగ్యం తద్వారా ఆరోగ్యకరమైన కుటుంబాలు మరియు సమాజాలకు పునాది ఇది మనందరికీ ఆశాజనకమైన భవిష్యత్తును ఇవ్వడంలో సహాయపడుతుంది. రక్తహీనత మరియు పౌష్టికాహార లోపం రాకుండా ముందు జాగ్రత్తగా వారిలో అవగాహన కల్పించి ఆరోగ్యవంతులు గా తీర్చిదిద్దడంలో మనందరం తోడ్పడాలి.