Listen to this article

రైతన్నలను వేడుకుంటున్న వాహనదారులు..

జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలోని కొంతమంది వాహనదారులు రైతులకు మొరపెట్టుకుంటున్నారు.
వరి కోతలు మొదలయ్యాయి. రైతులు రోడ్లపై వరి ధాన్యాన్ని పొసే వరకు వాహనదారులు, ఇబందులు పడుతున్నామని తెలిపారు. మరియు రైతులకూ విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.. రోడ్లపై దాన్యం పోయడం వల్ల రాత్రిపూట వాహనాలు నడిపే వాహనదారులకు, ధాన్యం కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్న్నాం, అని గతంలో రోడ్లపై ధాన్యం పోయడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి,అని తెలిపారు. రైతులు ఎవరు రోడ్లపై ధాన్యాన్ని పోయావద్దని రైతులను వాహనా దారులు వేడుకున్నారు.