

జనం న్యూస్ రిపోర్టర్ నర్సంపేట 07-04-2025
స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకేజీ మరియు ఐదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు . పాఠశాల ప్రిన్సిపాల్ నవీన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో, ఆటపాటల తమ ప్రతిభను కనబరిచి, అంది వచ్చిన ప్రతిఅవకాశాన్ని సద్వినియోపరచుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ శోభా రాణి, ప్రైమరీ ఇంచార్జ్ రమేష్, డీన్ రాజ్ కుమార్, ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలయ చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, , డి జి యం చేతన్, ఏ జి యం పద్మాకర్ , ప్రైమరీకోఆర్డినేటర్ అశ్విని , ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ సుధా , హై స్కూల్ కోఆర్డినేటర్ తిరుమలరెడ్డి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
