Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 7 :

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏన్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యం లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారని ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సైదయ్య తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రాములు మాట్లాడుతూ అసంక్రమిక వ్యాధులు అయినా గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ,మధుమేహం గురించి తెలియజేసి వీటిని మన చెంతకు రాకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తల్లులు మరియు శిశువుల ఆరోగ్యం ,ఆరోగ్యకరమైన కుటుంబాలు సమాజానికి పునాదులు అని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన ర్యాలీలో ఆరోగ్యమే మహాభాగ్యం అని, పరిసరాలును పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎన్ని కోట్ల వెచ్చించిన ఆరోగ్యాన్ని కొనలేమని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాములు, ప్రధానోపాధ్యాయులు సైదయ్య ,ఉపాధ్యాయులు శ్రీరామ్ మూర్తి ,వర్జినియా, నాగ శిరీష, దేవి , ప్రసాద్, శివ ,కార్తీక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.