

జమ్మికుంట బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించిన అభిశ్రీ ఫౌండేషన్ ఛైర్మెన్ ఆవుల వేంకటేశ్వర్లు..
జనం న్యూస్ // ఏప్రిల్ // 7 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
వికలాంగులకు, దివ్యాంగులకు, నిరుపేద విద్యార్థులకు, వితంతులకు ఆదుకోవడానికి, నిరుద్యోగులకు యువతకు అవకాశాల కల్పించడం కోసం వారికి అండగ ఉండడానికి గొప్ప లక్ష్యం తో అభిశ్రీ అభి శ్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని ఫౌండర్ చైర్మెన్ అన్నారు.జమ్మికుంట పట్టణంలోని హెచ్ పి పెట్రోల్ పంపు సమీపం లో బ్రాంచ్ కార్యాలయాన్ని సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అభి శ్రీ ఫౌండేషన్ చైర్మన్ ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పటి నుండి సుమారు 4 వేల మంది వికలాంగులకు, దివ్యాంగులకు సేకరించి ఉచిత భోజనం, వసతి కల్పించి విద్యతో పాటు కంప్యూటర్ శిక్షణ నేర్చించి ఎందరికో ఉద్యోగ అవకాశాల కల్పించి, సమాజంలో గౌరవంగా తల ఎత్తుకొని తిరిగేలా తయారు చేశామన్నారు. అదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు అభి శ్రీ ఫౌండేషన్ చేస్తుందన్నారు.
ఈ ప్రాంతంలోని టీం లీడర్స్ మరింత సేవ చేయాలని గొప్ప సంకల్పం తో జమ్మికుంట లో తమ బ్రాంచ్ కార్యాలయం ప్రారంభించడం అభినందనీయం అని అన్నారు. అభి శ్రీ ఫౌండేషన్ కుటుంబ సభ్యులను అందరినీ అభినందించారు. అనంతరం అర్హులైన టీం లీడర్స్ నీ శాలువాలతో ఘనంగా సత్కరించి మేమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీమ్ లీడర్ పాషా, కో – ఆర్డినేటర్ బైరీ సత్యం, డీకొండ రాజేందర్, మిరియాల్కార్ బాలాజి, ప్రభు పాటు సుమారు 50 మంది టీమ్ లీడర్స్ పాల్గొన్నారు.
