

జనం న్యూస్ ఏప్రిల్ 07(నడిగూడెం)
తెలంగాణలో ఆడపడుచులకు అండగా, వారి రక్షణ, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో డేగబాబు ఫంక్షన్ హాల్ నందు నడిగూడెం మండలానికి మంజూరు అయిన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ 56 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ కావాలని ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్, బిజెపిలు ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ప్రతిపక్ష పార్టీల మాయలో ప్రజలు ఎవరు పడొద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని ప్రజలెవరు అధైర్యపడోద్దని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్, ఆర్డీవో సూర్యనారాయణ, తహశీల్దార్ సరిత, నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం మల్లేష్ యాదవ్, మల్లెపు శ్రీను, మండలంలోని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
