Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 8(నడిగూడెం)

గత మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో దాసరి సంజీవయ్యకు ఫీల్డ్ అసిస్టెంట్ లు మంగళవారం వినతిపత్రం అందించారు. 2025 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే చెల్లించాలని జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు వినతిపత్రం అందించినట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు.