

జనం న్యూస్ ఏప్రిల్ 09(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మునగాల మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ చిత్రపటానికి మంగళవారం కోదాడ పట్టణంలోని వారి నివాసంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం గా ఉండాలని, కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి ఆయనకు వచ్చే పిఎఫ్ ఇతర ఆర్థిక వనరులను వెంటనే అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
