Listen to this article

జనం న్యూస్ 09 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఏంజెల్ ప్రైడ్ వినియోగదారుల హక్కుల సంఘం జిల్లా కన్వీనర్ గా పెందుర్తి కి చెందిన ఏలూరు వెంకటరమణ నియమితులయ్యారు. ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు పిల్లి యజ్ఞ నారాయణ ఈ మేరకు ఏలూరు వెంకటరమణకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వినియోగదారుల హక్కులు కాపాడేందుకు బాధ్యతాయుతంగా పని చేస్తానని స్వలాభాపేక్ష లేకుండా అంకితభావంతో వ్యవహరిస్తానని పేర్కొన్నారు. వినియోగదారుల హక్కులు పరిరక్షణకు అధికారులతో కలిసి చట్టపరంగా బాధ్యతలు నిర్వహిస్తానని వెల్లడించారు.