Listen to this article

రేకులపల్లి గ్రామానికి చెందిన పసుల గంగవ్వ, 26 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునామెకు గత రెండు సంవత్సరాల క్రితం తన బావ అయిన తాటిపల్లి మహేందర్ తండ్రి / లింగయ్య, 42 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ గ్రామం రేకులపల్లి అనునతనితో రెండో వివాహం జరగగా, ఇద్దరు మంచిగానే కలిసిమెలిసి ఉన్నారు. తదుపరి వారిరువురు కలిసి బతుకుదెరువు నిమిత్తం ముంబై వెళ్ళినారు. అక్కడ పసుల గంగవ్వకు నిత్యం కడుపునొప్పి లేస్తూ ఉంటే ఎన్ని మాత్రలు వేసుకున్న తక్కువ కావడం లేదని తన తండ్రి అయిన పశువుల లచ్చం కు తెలిపి, గత నెల కింద రేకులపల్లికి వచ్చి నివసిస్తున్నారు. అదే క్రమంలో ఆమెకు తేదీ 21-03-2025 రోజున అట్టి కడుపు నొప్పి ఎక్కువ అయ్యి భరించలేక ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగి పడిపోగా, తన అల్లుడు మహేందర్ మరియు కొడుకు అయిన పసుల లింగయ్య తో కలిసి తన కూతురిని జగిత్యాలలో ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు అనగా తేదీ 08-04- 2025 రోజున ఉదయం 11:30 గం,,లకు తన కూతురు చనిపోయిందని, తన కూతురు మరణంపై తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని, తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్పూర్ ఎస్సై కుమారస్వామి తెలియజేసినారు.