Listen to this article

క్రూడ్ అయిల్ ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతుంది

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా

జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బుధవారం మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ. 50 లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ, సబ్సిడీ యేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ భయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉపాధి పెంచి ధరలను తగ్గించాల్సింది పోయి,కేంద్రం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నదని విమర్శించారు. వెంటనే కేంద్రం గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50 రూపాయలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వీరబోయిన వెంకన్న,సింగిల్ విండో డైరెక్టర్ వెంపటి వీరబ్రహ్మం,ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఖాజాబీ,సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిలు, భూతం వెంకన్న,దైద సైదులు, డివైఎఫ్ఐ నాయకులు షేక్ ఖాదర్, డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్షుడు దాసరి గురవయ్య, కార్యదర్శి వెంపటి స్టాలిన్,పార్టీ సభ్యులు కోడి వెంకన్న,కోడి లింగరాజు,నబి సాహెబ్, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.