Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

ప్రజలు ప్రయాణికుల అవసర నిమిత్తం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీఆధ్వర్యంలో బస్టాండ్ లోని బస్ షెల్టర్ లో స్వచ్ఛమైన చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. బుధవారం నందలూరు బస్టాండులోని బస్ సెల్టర్ లో సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వచ్ఛమైన చల్లటి త్రాగునీటి కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్టాండు కూ డలి లో ఏర్పాటుచేసిన ఈ త్రాగునీటి కేంద్రం వలన ప్రజల దాహార్తి తీరుతుందన్నారు. నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్య నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేసవికాలంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేందుకు కోసం ప్యూరిఫైడ్ కూలింగ్ డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ప్రయాణికులు పాదాచారు లు తాగునీటిని సద్వినిగం చేసుకొవలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి సునీల్ నాగిరెడ్డిపల్లి కార్యదర్శి సురేష్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటరమణ వార్డు సభ్యులు గంధం గంగాధర్ నాగేంద్ర శంకర మస్తాన్ ఎముక దుర్గయ్య . గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.