

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
దళితబందు రెండవ విడిత రాని బాధితులందరు, వారి వారి మండలం లో ఎంపీడీఓ కార్యాలయం కి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలి అని, హుజురాబాద్ నియోజకవర్గం దళిత బంద్ సాధన సమితి నాయకులు ప్రవీణ్ పిలుపునిచ్చారు. ఇ సందర్బంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గం వర్గ లో రావాల్సిన రెండవ విడత నిదుల మంజూరు విషయంలో అధికార యంత్రాంగం కాలయాపన చేస్తుందని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తుంది, అని ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసే అవకాశం ఉందని తెలిపారు. కావున అన్ని మండలాల దళిత బంద్ రెండో విడిత బాధితులు జమ్మికుంట,ఇల్లంతకుంట,వీణవంక హుజురాబాద్ ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ కు దళితబందు మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలనీ యూనిట్ వెరిఫికేషన్ వెంటనే రద్దుచేసి గ్రౌండింగ్ మొదలుపెట్టలని వినతిపత్రం ఇవ్వాలని అన్నారు. మండలానికి సంబందించిన లబ్ధిదారులు వారి మండలం లో ఎంపీడీఓ కార్యాలయం కి వెళ్లి 11 గంటల వరకు వినతిపత్రం అందజేయాలనీ ప్రవీణ్ పిలుపునిచ్చారు.