Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

ప్రతి సంవత్సరం కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉన్న పదవ తరగతి విద్యార్థులలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న వారికి ఆలివ్ మిఠాయి దొరరాజు ఒక లక్ష రూపాయలు ఎంత మందికి వస్తె అంత మందికి అందించడం జరుగుతుంది..అలాగే ఈ సంవత్సరం కూడా అదే రీతి లో అందించడానికి బాగా చదవండి లక్ష రూపాయలు గెలవండి అనే కర పత్రాన్ని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేత ఆవిష్కరించారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆలివ్ మిఠాయి దొరరాజు పిల్లల లో ఒక మోటివేషన్ తీసుకువచ్చి వారి భవిష్యత్ కు భరోసా ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం వారి తల్లి తండ్రులతో ఉపాధ్యాయుల తో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి వారిలో ఒక నూతన ఉత్సాహం నింపుతున్నారు అని కొనియాడారు ఈ సందర్భంగా దొర రాజు మాట్లాడుతూ ఈ సంవత్సరం నుంచి విద్యార్థులు కు ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జూమ్ మీటింగ్ ద్వారా నిపుణులు అయిన వారితో విద్యార్థులు కు ఉండే సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపడం.పదవ తరగతి తర్వాత వారు ఎటువంటి కోర్సులు తీసుకోవాలి స్ట్రాటజీ ఏమిటి, టైం మేనేజ్మెంట్ వంటి వాటికి నిపుణులు అందుబాటులో ఉంటారని ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు