Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // కుమార్ యాదవ్..

ఇల్లందకుంట మండలానికి చెందిన సిరికొండ సదానందం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, మృతుని కుటుంబ సభ్యులను గురువారం నాడు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం పరామర్శించారు. సాధనందం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్ది కుమార్, జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మెన్ పోడేటి రామస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు,మాసాడి కిషన్ రావు, యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ సందాని తదితరులు పాల్గొన్నారు