Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..


దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో దళితబందు రెండవ విడత నిధులకు సంబందించిన గ్రౌండింగ్ ప్రక్రియ మొదలుపెట్టలని స్థానిక జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మరియు జమ్మికుంట ఎంపీడీఓ లకు యూనిట్ వెరిఫికేషన్ వెంటనే మొదలుపెట్టాలని వినతిపత్రం అందించడం జరిగింది.ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ నుండి యూనిట్ వెరిఫికేషన్ చేయాలనీ ఆదేశాల వచ్చిన కూడా అధికారులు దళితబందు విషయంలో కొంచం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇది ముమ్మాటికీ దళితులను మభ్యపెట్టాలని, ప్రభుత్వం చేస్తున్న కుట్ర, అని గతంలో రోడెక్కి ఎన్నో పోరాటాలు చేసి చివరికి ప్రభుత్వమే దిగివచ్చి దళితబందు మంజూరు చేయాలనీ తెలిపారు. జనవరి 27న ఎస్సీ కార్పొరేషన్ ఈ డి, నుండి ఆర్డర్ కాపీ రిలీజ్ చేసింది, అయిన కూడా అధికారులు దీనపై ఏలాంటి ప్రక్రియ మొదలుపెట్టడం లేదు, అంబేద్కర్ జయంతి లోపు దళితబందు గ్రౌండింగ్ మొదలుట్టకపోతే మళ్ళీ 5000 కుటుంబాలతో రోడడెక్కి పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చేలోపే దళితబందు మంజూరు పూర్తిస్థాయిలో అయిపోయే విదంగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని దళితబందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం సభ్యులు డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి నియోజకవర్గ ఇంచార్జ్ కోలుగూరి సురేష్, కోలుగురి నరేష్, అకినపల్లి ఆకాష్,సరిగోమ్ముల విజయ్ అకినపల్లి శిరీష,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.