

జనం న్యూస్. ఏప్రిల్ 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల అంబేద్కర్ జూనియర్ కళాశాల విద్యార్థుల సౌకర్యాల కొరకు10 డెస్క్ టాప్ కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ కు అందజేశారు.నీట్ మరియు జెఇఇ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఉపయోగపడడంతో పాటు, కళాశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా ఈ కంప్యూటర్లు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ అన్నారు.కంప్యూటర్ లపంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ లు చంద్రశేఖర్, మాధురి, అంబేద్కర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, ఫిసికల్ డైరెక్టర్ గణపతి, పిఈటి సూర్యం, లెక్చరర్ నరేష్ యాదగిరి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కు కృతజ్ఞతలు తెలిపారు.
